Sunday, June 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హాజీమ్ కు ఘన సన్మానం

మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హాజీమ్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
డోంగ్లి మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షులుగా హాజీమ్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు గజానన్ దేశాయ్ ఆధ్వర్యంలో ఆదివారం సన్మాన సభ ఏర్పాటు చేసి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్, డోంగ్లీ మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు బాచావార్ లక్ష్మణ్, మండల సర్పంచులు మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మానించి స్వీట్లు పంచి పెట్టుకున్నారు.

మా మద్నూర్ మండల ముద్దు బిడ్డ షేక్ అజీమ్ కామారెడ్డి జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా డోంగ్లీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా పదవి మా ఉమ్మడి మండలానికి రావడం ఎంతో గర్వకారణమన్నారు. అనంతరం మండల అధ్యక్షులు గజానన్ దేశాయ్ మాట్లాడుతూ..ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు, అలాగే డిసిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ కు, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునికి అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునికి సన్మానించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -