- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సావర్గావ్ తాండా గ్రామంలో శనివారం నాడు అంగన్వాడీ టీచర్ బుజ్జిబాయి ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామంలోని గర్భిణీలకు , బాలింతలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సెంటర్ టీచర్ మాట్లాడుతూ పిల్లలు నిత్యము అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు పౌష్టికారం ప్రభుత్వం అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, మహిళా సంఘాల నాయకులు, అంగన్వాడీ టీచర్, హెల్త్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



