Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే..
నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే  తమ సొంత గ్రామం డోన్గావ్ లోని గ్రామపంచాయతీలో సర్ SIR (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా (SIR) సర్ ఫారాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓటు హక్కు మన ప్రజాస్వామ్యానికి పునాది. ప్రతి అర్హత కలిగిన ఓటరు SIR కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన ఫారాలను పూర్తి చేసి సమర్పించడం ద్వారా తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలి. ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ కార్యక్రమం ఓటరు జాబితాను నవీకరించడం మరియు అర్హులైన ప్రతి ఒక్కరి పేరు సరైన విధంగా నమోదయ్యేలా చేయడమే లక్ష్యం.

“నా ఓటు – నా హక్కు, నా బాధ్యత.”
ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. SIR సర్ కార్యక్రమంలో పాల్గొనండి… మీ ఓటు హక్కును కాపాడుకోండి… ప్రజాస్వామ్యాన్ని బలపరచండి! అని ప్రజలకు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు గ్రామ పెద్దలు ,యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -