-సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్
-అధికారులపై మండి పడ్డ ప్రజాప్రతినిధులు
-సభలో స్పృహ కోల్పోయిన సూపర్వెసర్
నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ లోని అధికంగా గిరిజన ప్రజలు నివసిస్తున్నారు దింతో ఏదైనా అనుకోకుండా వ్యాధులు ప్రభాలిస్తే వారికి మెరుగైన వైద్య సేవలు అందకుండా పోతున్నాయని మండల ప్రజలు ఎమ్మెల్యే కు శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే కు ప్రజా ప్రతినిధులు తెలపడంతో ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి 30పడకల అస్పత్రి మంజూరు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. దింతో మండలానికి అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతోఇక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ప్రమాదాలు జరిగిన గంటకు బైంసా నుంచి వచ్చే సరికి పరిస్థితి విషమించి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయన్నారు.
ముందుగా వ్యవసాయ శాఖ సంబదించిన సమాచారాన్ని మండల వ్యవసాయ అధికారి సారిక తమ నివేదికను చదివి వినిపించారు దింతో కొందరు సర్పంచులు ఒక్కసారికి రైతులుకు అవసరమైన యూరియా, డి ఏ పి లను అధిక ధరలకు అమ్ముతున్నారని వారిపైఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులను మోసం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామమలో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా పనులు కేవలం సర్వే లకు మాత్రమే పరిమితం చేస్తూ రెండో విడత మాత్రం మంజూరు చేయడం లేదని గృహ నిర్మాణా శాఖ పీడీ శ్రీనివాస్ పై సర్పంచులు మండిపడ్డారు.దింతో విద్యుత్, అటవీ శాఖ, నీటి పారుదల శాఖ,పంచాయతీ రాజ్,అధికారుల పని తీరుపై ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని రోజుల్లో పని తీరు మార్చుకోలేదంటే పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులతో కలసి ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు,తహసీల్దార్, విద్య శాఖ అంగన్వాడీ శాఖలకు చెందిన అధికారులు తమ తమ నివేదికలను సమావేశంలో చదివివినిపించారు.
-స్పృహ కోల్పోయిన ఐసీఐడీస్ సూపర్వెసర్…
సర్వసభ్య సమావేశం జరుగుతున్నా సమయంలో ఒక్కసారిగా ఐసీఐడీస్ సూపర్వెసర్ అకస్మత్తుగా స్పృహ తప్పి సర్వసభ్య సమావేశంలోనే కింద పడిపోవడంతో కుర్చీలోనే చలనం లేకుండా పోవడంతో అక్కడి సిబ్బంది వెంటనే అస్పత్రికి తర్లించారు.ఈ కార్యక్రమం లో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గంగాచరణ్ చెర్మన్ కళ్యాణ్, వివేకానంద,మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి,సర్పంచుల సంఘం అధ్యక్షులు మారుతీ తహసీల్దార్ శ్రీదేవి ఎంపీడీఓ శ్రీనివాస్ విద్యాధికారి విజయ్ కుమార్ ఎంపీఓ భీమేష్, ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.



