Sunday, June 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు.ఈ సందర్భంగా యోగ యొక్క ప్రత్యేకత,యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.యోగ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని,మానసిక ఒత్తిడిని,శారీరక ఒత్తిడి తగ్గించవచ్చని తెలిపారు.యోగ ఆసనాలు వేయడం ద్వారా శరీరం యొక్క బరువు కూడా తగ్గుతుందని,వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందని,ఏకాగ్రత పెరగడం వల్ల చదువులో చురుకుగా ఉంటారని,ఏకాగ్రతతో చదవడం వల్ల ఎక్కువ జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుందన్నారు.సాధ్యమైనంత వరకు రోజు కొన్ని ఆసనాలు వేయడం చాలా ముఖ్యమని విద్యార్థిని,విద్యార్థులకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -