Sunday, June 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ గడ్డం క్రాంతికి శ్రీనుబాబు పరామర్శ

సర్పంచ్ గడ్డం క్రాంతికి శ్రీనుబాబు పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూండ్ల గ్రామ సర్పంచ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాంతికి ఇటీవల ప్రమాదవశాత్తు కాలు ఫ్యాక్చర్ అయింది. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్యతో కలిసి ఆదివారం ఆయనను పరామర్శించారు. అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ డివిజన్ నాయకుడు రాహుల్, బొబ్బిలి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -