Sunday, June 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రానికి చెందిన ఠాగూర్ నిర్మల బాయ్ దనగర్ చిన్నబాయి, సిరిపెల్లి గ్రామానికి చెందిన చవాన్ బలరాం, సంగ్వి గ్రామానికి చెందిన గంగా గౌడ్ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులను ఆదివారం ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు కిరణ్ కొమ్రే వార్ పరామర్శించారు. అదేవిధంగా మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను ముందు ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరూ కూడా అధైర్య పడొద్దని, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పుప్పాల పిరాజి. బిఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎన్నిలా అనిల్, ఆయా గ్రామ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -