Sunday, June 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన పేదలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి 

అర్హులైన పేదలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
అర్హులైన పేదలకు కొత్త పెన్షన్లను జూన్ 2న విడుదల చేస్తానని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలేరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఈ సంఘం సభ్యులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాలలో దరఖాస్తు చేసుకున్నవారికీ పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, పట్టణ, మండల కార్యదర్శిలు గొట్టిపాముల శ్రీనివాస్ , చౌడబోయిన కనకయ్య, సిపిఐ నాయకులు గిరబోయిన స్వామి, చౌడబోయిన పరశురాములు, కందుల మధు, అభి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -