నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం దుబ్బపేట గ్రామంలో శ్రీఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తన భూమిని విరాళంగా ఇచ్చినట్లుగా గ్రామ సర్పంచ్ భూక్య రవిందర్ నాయక్ తెలిపారు. ఇందుకు సర్పంచ్ తో పాటు గ్రామ ప్రజలు చైర్మన్ మొండయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా భూ విరాళ దాతల కోసం వెతుకుతున్న క్రమంలో విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య స్వతహాగా ముందుకు వచ్చి, తన భూమికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. దీంతో సర్పంచ్ తో పాటు గ్రామస్తులు మొండయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొండయ్య, ఆయన కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు, సుఖశాంతులు, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకొన్నారు.
ఆంజనేయుడి గుడి నిర్మాణానికి పిఏసిఎస్ చైర్మన్ భూ విరాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



