Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రీ ప్రైమరీలో పోస్టులకు పోటీ.!

ప్రీ ప్రైమరీలో పోస్టులకు పోటీ.!

- Advertisement -

మండలంలో 7 ఇన్స్ట్రక్టర్, 7 ఆయా పోస్టులు
మొత్తం 159 దరఖాస్తులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. గత విద్యా సంవత్సరం మొదటి విడతలో ఆరు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ప్రారంభించగా ఈ సంవత్సరం మరో ఏడు పాఠశాలలను ఎంపిక చేసి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. మండల వ్యాప్తంగా 7 ఇన్స్ట్రక్టర్లు పోస్టులకు 116 దరఖాస్తులు, 7 ఆయాల పోస్టులకు 43 దరఖాస్తులు మండలంలోని మల్లారం, వల్లెంకుంట, పెద్దతూండ్ల, గాదంపల్లి, నాచారం, జంగిడిపల్లి, ఆన్సాన్పల్లి గ్రామాల నుంచి 159 మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్లుగా మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు తెలిపారు.

సర్కారుబడిలో ఎల్ కేజీ, యూకేజీ
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య (ఎల్ కేజీ, యూకేజీ) లేకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ చదివిస్తున్నారు. దీంతో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అదే పాఠశాలలో ఉండి చదువుకోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.ప్రిప్రయిమరి స్కూళ్లు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అంగన్వాడీ సెంటర్ లో నమోదై ఉన్న 3 సంవత్సరాలు నిండిన విద్యార్థులను అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తారు. పిల్లలకు బోధించేందుకు ఇన్స్ట్రక్టర్కు వేతనం రూ.8 వేలు, ఆయాకు వేతనం రూ.6 వేలు ఇవ్వనున్నారు.

మెరిట్ ఆధారంగా ఎంపిక..
ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు మెరిట్ ఆధారంగా స్థానికులకు అవకాశం ఇవ్వనున్నారు. ఇన్స్ట్రక్టర్ 7 పోస్టులకు గాను 116 మంది, ఆయా 7 పోస్టులకు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్స్ట్రక్టర్ ఇంటర్ మెరిట్, ఆయాకు 7వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా జాబితా తయారు చేసి ఒక్కో పోస్టుకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపిక కమిటీలో కన్వీనర్ కలెక్టర్, కో కన్వీనర్ గా అదనపు కలెక్టర్, డీఈవో సభ్యుడు సెక్రటరీగా, జిల్లా సంక్షేమ అధికారి సభ్యులుగా వ్యవహ రిస్తారు.నాలుగు రోజుల్లో ఎంపిక ప్రక్కియ పూర్తి చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -