యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. యశ్ బర్త్ డే సందర్భంగా ‘ఇంట్రడ్యూసింగ్ రాయ’ అంటూ తన పాత్రను పరిచయం చేస్తూ, రిలీజ్ చేసిన గ్లింప్స్ ఎంత సంచలనమైయ్యిందో అందరికీ తెలిసిందే. కియారా అద్వానీ నాడియాగా, హుమా ఖురేషి ఎలిజబెత్‌గా, నయనతార గంగగా, తారా సుతారియా రెబెక్కాగా, రుక్మిణి వసంత్ మెల్లిసాగా అద్భుతమైన పాత్రల్లో కనిపించనున్నారు. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం ఈ మూవీ టీజర్ విడుదలై, అభిమానులను అలరిస్తోంది. ఈ టీజర్‌ను కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఒక వైపు చూడటానికి రంగుల ప్రపంచంలా కనిపిస్తూనే, హింసాత్మకమైన స్వరూపాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
సర్కస్ వాతావరణం, తూర్పు ఆసియా శైలిని గుర్తు చేసే నేపథ్యాల వరకు వివిధ కాలాల్లో కథ ప్రయాణిస్తున్నట్లు టీజర్‌ను రూపొందించారు. మొత్తం మీద ఒక డార్క్, కాస్త రఫ్ టోన్‌తో టీజర్ కనిపిస్తుంది. టీజర్‌లో చూపించిన బలమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాల వెనుక ఒక లోతైన భావం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. కథ చెప్పే విధానంపై ప్రత్యేక శ్రద్ధ, నటీనటుల శక్తివంతమైన ప్రదర్శన..ఇవన్నీ ఈ ప్రపంచానికి ఎంతో కీలకమని టీజర్ సూచిస్తోంది. చిత్ర బృందం టీజర్ విడుదల సందర్భంగా ‘ఇట్స్ గాన్ గెట్ క్రేజీ’ అంటూ ఒక ఉత్కంఠభరిత హెచ్చరికను ఇచ్చింది. టీజర్లో కనిపించిన భారీ దృశ్యాలు, భయనకమైన, ఉత్కంఠభరితమైన సీన్స్ చూస్తుంటే మార్చి 19న రాబోతున్న టాక్సిక్ మూవీపై ఉన్న అంచనాలను మించేలా ఉందనేది తెలుస్తోంది.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘టాక్సిక్..’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



