- Advertisement -
గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారంటున్నా స్థానికులు
నవతెలంగాణ – మిరుదొడ్డి
గుర్తుతెలియని వ్యక్తులు కాంగ్రెస్ నాయకుల్ని దారుణంగా హత్య చేసిన సంఘటన సిద్దిసిద్ది జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి చెల్లాపూర్ వార్డులో చోటుచేసుకుంది. చేల్లాపూర్ చెందిన కాంగ్రెస్ నాయకుడు వంగ బాల్ రెడ్డిని శుక్రవారం రాజక్క పేట గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు పాత కక్ష్యలు, భూ తగాదాలు లేదా శత్రువుల కోణంలో విచారణ ప్రారంభించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఈ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



