‘మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన మంజునాథ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో మంజునాథ్ హీరోగా వి.లక్ష్మీ దేవి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం ఈనెల 19న హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా, డీవోపీ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి చిత్ర దర్శకుడు అభిరామ్ గంటా గౌరవ దర్శకత్వం వహించారు. హీరో మంజునాథ్ మాట్లాడుతూ, ‘నేను హీరోగా నటించిన ‘మా ఊరి ప్రేమకథ’ చిత్రం మంచి విజయం సాధించి హీరోగా మంచి పేరు తెచ్చింది.
వెంటనే ‘రౌడీ విక్రమ్’ సినిమా అవకాశం వచ్చింది. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగా మరొక చిత్రం ‘పక్కా ప్రేమికుడు’లో కూడా హీరోగా చేస్తున్నాను. ఈ రెండు చిత్రాలు అండర్ ప్రొడక్షన్‌లో ఉండగానే అభిరాం గంటా చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో నేను ఫ్యాషన్ డిజైనర్‌గా నటిస్తున్నాను. అవుట్ అండ్ అవుట్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’ అని అన్నారు. ‘లవ్, కామిడీ, సస్పెన్స్, ఏమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి’ అని దర్శకుడు అభిరామ్ గంటా చెప్పారు. నిర్మాత వి.లక్ష్మీ దేవి మాట్లాడుతూ,’హీరో మంజునాథ్ సరసన ప్రముఖ హీరోయిన్ కథానాయికగా నటించనుంది. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’ అని తెలిపారు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



