Tuesday, June 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో నేటి నుంచి విత్తన మేళా..

తెలంగాణలో నేటి నుంచి విత్తన మేళా..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతు వేదికల్లో జూన్ 23 నుంచి 30 వరకు విత్తన మేళాలను నిర్వహించనుంది. రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పెసర, మినుము, కంది, నువ్వులు, వేరుశెనగ, చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువులు కూడా విక్రయించనున్నారు. బీపీటీ-5204, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ సోనా వంటి ప్రముఖ వరి రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. వ్యవసాయ నిపుణులు విత్తన ఎంపిక, పంట యాజమాన్యం, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -