- Advertisement -
నవతెలంగాణ -ముధోల్ : బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఉప ఆలయమైన మహంకాళి ఆలయంను మంగళవారం ఉదయం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కూమార్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్ లు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజనీదేవి ని పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆలయంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆలయ అధికారులకు సూచించారు. భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, సీసీ కెమెరాల పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
- Advertisement -


