Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిని ఖండిస్తున్నాం

రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిని ఖండిస్తున్నాం

- Advertisement -

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడించాలని బీజేవైఎం తీసుకున్న కార్యాచరణను ఖండిస్తున్నట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  నిన్న ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఏ.ఐ సమ్మిట్ కు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదనారు. అంతర్జాతీయ స్థాయి ట్రేడ్ ఒప్పందంలో భాగంగా దేశంలో ఉన్న ప్రజలకు,రైతులకు నష్టం జరిగే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంప్రమైజ్ అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అమెరికాతో జరిపిన వాణిజ్య ఒప్పందాల్లో మోడీ దేశానికి నష్టం చేశారని, అమెరికా అధ్యక్షుడు చెప్పిన విధంగా మోడీ నడుచుకుంటున్నారని, ఏ.ఐ సమ్మిట్ లో విదేశాల నుంచి తెచ్చిన పరికరాలను వాడారని అన్నారు. 

దేశంలో ప్రధానమంత్రి ప్రజల ముందు కేవలం షో చేస్తున్నారని, విదేశాల్లో తయారు చేసిన పరికరాలను మన దేశంలో తయారు చేసినట్లు మోడీ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న యువత,రైతుల గురించి మోడీ ఆలోచించడం లేదనారు. దేశంలో ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై మోడీ శ్రద్ద చూపడం లేదని, దేశ,విదేశాల నుంచి ప్రతినిధులను తీసుకువచ్చి భారత్ గొప్పగా ఉందని మోడీ బిల్డప్ ఇస్తున్నారని, దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. దేశ ప్రజలను నరేంద్ర మోదీ తప్పుదోవ పట్టిస్తు, ఏ.ఐ.సమ్మిట్ తో ఉద్యోగాలు వస్తే స్వాగతిస్తామని, విదేశాల్లో ఉన్న తన మిత్రుల కోసం ట్రేడ్ డీల్స్ మోడీ చేసుకుంటున్నారనారు. ట్రేడ్ డీల్స్ లో మార్పులు చేయాలని, అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు ఓపెన్ ట్రేడ్ మార్కెట్ ఇవ్వాలని, నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నట్లు మోడీ ట్రేడ్ డీల్స్ వెనక్కి తీసుకోవాలని, దేశంలో ఉన్న రైతులు,యువత,ప్రజల కోసమే యూత్ కాంగ్రెస్ నిరసన తెలిపిందనారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -