శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న నయా సినిమా ‘స్టూడెంట్`. విజేత పరీక్ హీరోయిన్. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి కో ప్రొడ్యూసర్స్. మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు.
పవర్ స్టార్ సినిమాకు బ్యానర్స్ కట్టడం, జామెట్రీ బాక్స్ లోని డివైడర్ ను క్లాసులో కాకుండా ఫైట్లకు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, అందంగా లవ్ లెటర్స్ రాయ డం.. ఇలా స్టూడెంట్స్ లైఫ్ లో భాగమైన వన్నీ ఈ పోస్టర్లో కనిపించి ఆకట్టు కుంటున్నాయి. ‘ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు’ అని రాసిన కొటేషన్ హీరో డేరింగ్ క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తుండగా.. ‘ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి, తన్మయ్ లవ్స్ భాను..’ అని రాసిన మాటలు ఈ స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాలో ఉన్న పవర్ ఫుల్ లవ్ స్టోరీని చూపిస్తున్నాయి. మేఘాంశ్ శ్రీహరి, విజేత పరీక్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే – నగేష్ గుండపనేని, ఆర్ట్ డైరెక్టర్ – రాజు చిరుపెల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉదయ్ పెండ్యాల, స్టంట్స్ – రియల్ సతీష్, ఎడిటర్ – నరేష్ అడుపా, హరిశంకర్ టీఎన్, డీవోపీ – శ్రీనివాస్ బెజుగం, మ్యూజిక్ – ప్రేమ్ చంద్ కంచర్ల.
‘స్టూడెంట్`గామేఘాంశ్ శ్రీహరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



