- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రేపు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ఈ ఫలితాలు అధికారికంగా విడుదల కానున్నాయి. ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే.టెన్త్ సప్లిమెంటరీ రాసిన విద్యార్థులంతా రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫలితాలను చూసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
- Advertisement -



