నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో రూ.1 కోటి, 9 వేల సీఎంఆర్ఎఫ్ 266 చెక్కులను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేయించారని మంథని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆదివారం మంత్రి సహచరుడు చంద్రశేఖర్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మహదేవ్ పూర్, మల్హర్ రావు, పలిమెల మండలాలకు సంబంధించిన మొత్తం 266 చెక్కులకు గాను దాదాపు రూ.కోటి 9 వేలు విలువ చేసే చెక్కులు మంజూరైయ్యాయి. మంథని నియోజకవర్గంలో పలు ఆసుపత్రుల్లో అనారోగ్యంతో చికిత్స పొంది సహాయం కొరకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి బాధితులు విన్నవించగా.. వీరికి ప్రభుత్వం నుండి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసినట్లుగా తెలిపారు.
ఇందులో భాగంగా మండలంలో రుద్రారం గ్రామానికి చెందిన ముడేతుల బుచ్చమ్మ రూ.1.2500,చింతల రాజయ్య రూ.40,500 లక్షలు, తాడిచెర్ల గ్రామానికి చెందిన బండి రాజక్కకు రూ.69 వేలు, రేపాల వసంత రూ.26 వేలు, పేరాల రజిత రూ.30 వేలు, బోనగిరి రసజ్ఞ రూ.33,500, వళ్లెంకుంట గ్రామానికి చెందిన ముల్కల్ల తేజశ్రీ రూ.21 వేలు, గడ్డం రమేష్ రూ.25 వేలు, ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన గుగులోత్ అక్షత రూ.2 లక్షలు, ఎడ్లపల్లి గ్రామానికి చెందిన తోకల పోచమ్మకు రూ.55 వేలు, చెన్నవేన నిరోషకు రూ.60 వేలు, చిన్నతూండ్ల గ్రామానికి చెందిన మిరియాల వెంకటేశ్వరి రూ.26,500 వేలు, పెద్దతూండ్ల గ్రామానికి చెందిన నాంసాని మౌనికకు రూ. 25 వేలు, నాచారం గ్రామానికి చెందిన దొగ్గెల కుమారస్వామికి రూ.35వెలు మంజూరైయ్యాయి.



