Wednesday, July 15, 2026
E-PAPER
Homeజిల్లాలుప్లాస్టిక్ నియంత్రణకు స్టీల్ ప్లేట్ల వితరణ 

ప్లాస్టిక్ నియంత్రణకు స్టీల్ ప్లేట్ల వితరణ 

- Advertisement -

నవతెలంగాణ-మోర్తాడ్ మండలం దునకల్ గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ లో భాగంగా 1000 స్టీల్ ప్లేట్లు ,గ్లాసులను స్థానిక గ్రామపంచాయతీకి అందజేశారు. గ్రామానికి చెందిన దంతాల ప్రభాకర్ తూర్పు గంగారెడ్డి  సర్పంచ్ అనిల్ కు వీటిని బుధవారం అందజేశారు. గ్రామంలోని వివాహ కార్యక్రమాలతో పాటు వివిధ కార్యక్రమాలలో ప్లాస్టిక్ ప్లేట్లు పరికరాలు వాడకుండా వీటిని ఉపయోగించుకొని గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ చేపట్టాలని దాతలు కోరారు. ప్లాస్టిక్ నియంత్రణ సహకరించిన దాతలను సర్పంచ్ అనిల్, ఉపసర్పంచ్ భూమారెడ్డి అభినందించారు. వీటిని ప్రస్తుతం గ్రామపంచాయతీ లో అందుబాటులో ఉంచగా గ్రామ ప్రజలకు వీటిని అవసరాల నిమిత్తం అందుబాటు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ స్వప్న గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -