Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శలో రోల్ మోడల్ ఇంట్రడక్షన్ విత్ గర్ల్స్ పోగ్రామ్

ఆదర్శలో రోల్ మోడల్ ఇంట్రడక్షన్ విత్ గర్ల్స్ పోగ్రామ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పిఎంశ్రీ పథకంలో భాగంగా మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రోల్ మోడల్ ఇంట్రడక్షన్ విత్ గర్ల్స్ ప్రోగ్రాంలో గ్రూప్ వన్ ఆఫీసర్ గడ్డం నాగ వైష్ణవి హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటే బాగుపడతారు,ఏ దారిలో వెళ్తే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారనే అంశాలపై అవగాహన కల్పించారు. అమ్మాయిలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాలపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. విద్యార్థులు అడిగే డౌట్స్ పై గైడ్ చేసి మోటివేషన్ అందించారు. ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన గ్రూప్ వన్ ఆఫీసర్ నాగ వైష్ణవికి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.నాగా వైష్ణవి స్కూల్ కి భగవద్గీతను అందజేసి విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -