Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మదర్ డైరీకి మంచి రోజులు : ప్రభుత్వ విప్

మదర్ డైరీకి మంచి రోజులు : ప్రభుత్వ విప్

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు : మదర్ డైరీ పాడి రైతులకు మంచి రోజులు రానున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.నల్గొండ రంగారెడ్డి జిల్లాలోని  రైతులను ఆదుకునేందుకు మదర్ డైరీ నీ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ డైరీగా చేయడమే లక్ష్యం అంటూ యాదాద్రి జిల్లా కేంద్రంలోని మదర్ డైరీ విశ్రాంతి గృహంలో బుధవారం నాడు జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

గత బి ఆర్ ఎస్ పాలనలో పదేళ్లపాటు మదర్ డైరీ ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి 50 కోట్ల నష్టాల్లో మదర్ డైరీ ఉందని మదర్ డైరీ ని  లాభాల బాట పట్టించడమే ధ్యేయంగా మంత్రి వాకిటి శ్రీహరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు మదర్ డైరీ పాలకవర్గము సమిష్టి కృషి తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు సీఎంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో మదర్ డైరీ కి అత్యధిక పాడి రైతులు ఆధారపడి జీవోనోపాధి పొందుతున్నారని చెప్పడంతో పాటు మదర్ డైరీ ని కాపాడడానికి తీసుకోవలసిన చర్యలు గూర్చి చెప్పడంతో సానుకూలంగా స్పందించి గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ ను కలిసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది అన్నారు.ఎన్ బి డి చైర్మన్ మినిషా మదర్ డైరీ అభివృద్ధి బాటలో పట్టేందుకు చేయాల్సిన సహకారం అందిస్తానని హామీ ఇవ్వడం తోపాటు మదర్ డైరీ పాడి రైతులు 10 బిల్లులు పెండింగ్లో ఉంటే 10 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయడంతో పాటు గతంలో చేసిన అప్పులకు ప్రతినెల 45 లక్షల రూపాయల వడ్డీ చెల్లించడం తో వస్తున్న నష్టాలను చూసి వెంటనే 30 కోట్ల రూపాయలు రెండు విడతలలో  బ్యాంక్ బకాయి చెల్లించారని చెప్పారు ప్రభుత్వ సంస్థ విజయ డైరీ తో సమానంగా అదే రోజు రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రతి  లీటర్ పాలకు ఒక రూపాయి 50 పైసలు పెంచడంతోపాటు 1000 లీటర్లు పాలు కలెక్షన్ చేసే పాల కేంద్రానికి వెయ్యి రూపాయలు.   

100 లీటర్లు పాలు పోసి రైతుకు వంద రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగిందన్నారు గతంలో అనేక లాభాలతో ఉన్న మదర్ డైరీ ని నష్టాల పాలు చేసిన బి ఆర్ ఎస్ ను రైతులకు క్షమించరన్నారు.మదర్ డే ని కాపాడుకునే బాధ్యత రైతులపై పాలకవర్గంపై ఉందన్నారు ప్రైవేట్ డైరీలు మోసాలు చేస్తూ  రైతులను ఆకర్షించేందుకు ఎండాకాలంలో ఎక్కువ రేట్లు చెల్లించి వర్షాకాలం రాగానే సాకులు చెబుతూ  పాలు తీసుకోవడం లేదని అప్పుడు రైతులు మదర్ డైరీ ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ప్రైవేట్ డైరీలకు దీటుగా మదర్ డైరీ రూపొందే విధంగా బర్రె పాలకు. వెన్న పది శాతం వస్తే ఐదు రూపాయలు ఆవుపాలకు రెండు రూపాయల 50 పైసలు మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మరియు డైరెక్టర్లతో రైతులకు శుభవార్త అంటూ కరపత్రాలు విడుదల చేసి తెలిపారు.భువనగిరి లోని మదర్ డైరీ రైతులకు సబ్సిడీతో దాన ఉత్పత్తి కేంద్రం ప్రారంభించడం తోపాటు పశువులకు కావలసిన మందులు సబ్సిడీలో అందజేసేందుకు పాలకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. 

గతం గుర్తు చేసుకుంటూ నా రాజకీయ జీవితమే పాలకేంద్రం చైర్మన్గా ప్రారంభ మై సర్పంచ్ గా ఎం పీ టీ సీగా ప్రస్తుతంఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ గా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన  పాడి రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ మాజీ జిల్లా అధ్యక్షులు అన్నం సంజీవరెడ్డి మదర్ డైరీ డైరెక్టర్లు భక్తుల నరేందర్ రెడ్డి పి నర్సింలు జి రామ్ రెడ్డి ఎస్ భాస్కర్ కే పాండు కే శ్రీశైలం కాంగ్రెస్ మదర్ డైరీ మేనేజర్ ఎడ్ల నరేందర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -