మీరు ఎలాంటి ఆహారం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది చాలా ముఖ్యం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. పోషకాహారం తీసుకోవడంతో పాటు పోర్షన్ కంట్రోల్‌లో ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీ పోర్షన్ సైజ్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. చిన్న ప్లేట్/ చిన్న గిన్నెలో ఆహారం తినండి. క్యాలరీలు తక్కువగా, పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో ఎక్కువగా చేర్చుకోండి.
సోడియం, క్యాలరీలు అధికంగా ఉండే జంక్, ప్రాసెస్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.. పండ్లు, కూరగాయలలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పండ్లు, కూరగాయల వంటి ప్లాంట్ బేస్డ్ డైట్ మీ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
తృణధాన్యాలు..
తృణధాన్యాలలో ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ శరీరంలోని కొవ్వును గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది, ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. మీ డైట్‌లో బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, క్వినోవా, బార్లీ వంటి ఆహార పదార్థాలను తీసుకోండి.
అనారోగ్య కొవ్వులను తగ్గించండి..
సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె సమస్యలను పెంచుతాయి. మీ డైట్‌లో వీటిని తీసుకోవడం తగ్గిస్తే.. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి, కొరోనరీ ఆర్టరీ వ్యాధి ముప్పు కూడా తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే.. ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. దీన్నే అథెరోస్క్లెరోసిస్ అని పిలుస్తారు. ఇది గుండె పోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
లో ఫ్యాట్ ప్రొటీన్ సోర్స్ తీసుకోండి..
లీన్ మాంసం, పౌల్ట్రీ, చేపలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, గుడ్లలలో ప్రోటీన్ పుష్కంగా ఉంటుంది. అధిక కొవ్వు ఉన్న ప్రొటీన్ సోర్స్‌కు బదులుగా లో ప్యాట్ ఫుడ్ తీసుకోవాలి. కొన్ని రకాల చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ను కరిగిస్తాయి. మీ డైట్‌లో సాల్మన్, మాకేరెల్, హెర్రింగ్ వంటి చేపలను చేర్చుకోండి. అవిసె గింజలు, వాల్‌నట్‌లు, సోయాబీన్స్, బఠానీల లోనూ ప్రొటీన్ అధికంగా ఉంటుంది, కొవ్వు తక్కువగా ఉంటుంది.
గుండె ఆరోగ్యానికీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



