- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కష్టాల్లో ఉండి, మానసిక వేదనతో ఆసరా కోసం ఆశగా పోలీస్ స్టేషన్ల గడప తొక్కే ప్రజల పట్ల మీరు చూపించే ఔదార్యం ఇదేనా?’ అంటూ అధికారులను నిలదీశారు. బాధితులతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అని మండిపడిన ఆయన.. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారితో అమర్యాదగా, బాధ్యతారహితంగా ప్రవర్తించే సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి నేర సమీక్షా సమావేశంలో సీపీ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -



