- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్ రాజ్‌కోట్‌లోని గొండాల్ చౌక్డీ సమీపంలో గల తన అద్దె ఫ్లాట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అభ్యర్థి నందని బోస్మియా(23) ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతిచెందారు. నందని ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు వచ్చిచూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అస్లాం హుస్సేన్ సమా అనే వ్యక్తి తన కూతురిని శారీరకంగా, మానసికంగా వేధించేవాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నిందితుడు అస్లాం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



