Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బల్మూరులో ఘనంగా పెద్దమ్మ బోనాలు 

బల్మూరులో ఘనంగా పెద్దమ్మ బోనాలు 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
మండల కేంద్రం బల్మూరులో పెద్దమ్మ బోనాలు పండుగను సోమవారం పెద్దమ్మ చింతలు గుడి వద్ద ఘనంగా బోనాలు ఎత్తి సంబరాలు జరుపుకున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానంగా గొల్ల కులం వారు మాత్రమే జరుపుకునే ఈ పండుగకు మండల కేంద్రంతో పాటు లింగాల మండలం వారు కూడా మొక్కులు తీర్చుకునేందుకు వస్తారు. ఇటీవల గుడి నిర్మాణం జరుపుకున్న సందర్భంగా వరుసగా మూడు సంవత్సరాలు ఉత్సవాల జరుపుకొని అనంతరం రెండేళ్లకోసారి ఉత్సవాల జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. బైండ్ల పూజారులు బండారు చల్లి కార్యక్రమాలను ముగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ గ్రామ ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -