Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హామీ ఇచ్చారు.. అమలు పరిచారు

హామీ ఇచ్చారు.. అమలు పరిచారు

- Advertisement -

వైకుంఠ ధామానికి విద్యుత్ సౌకర్యం
నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్) 

దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీర్కూర్ వైకుంఠ ధామానికి ఎట్టకేలకు విద్యుత్ వెలుగులు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు శశికాంత్ చొరవతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్మశాన వాటికలో విద్యుత్ సౌకర్యం కల్పించే పనులను ప్రారంభించారు. గ్రామంలోని స్మశాన వాటికలో విద్యుత్ లేకపోవడంతో రాత్రి వేళల్లో అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. చుట్టూ గడ్డి పెరిగి, విషపురుగులు సంచరించే పరిస్థితుల్లో చీకట్లోనే దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చేది. ఇటీవల గ్రామానికి చెందిన ఓ యువకుడి అంత్యక్రియలకు హాజరైన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శశికాంత్ ఈ సమస్యను ప్రత్యక్షంగా గమనించారు.

వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన శశికాంత్, వారం రోజుల్లోగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన ట్రాన్స్కో అధికారులు గురువారం స్మశాన వాటికలో విద్యుత్ స్తంభాల ఏర్పాటును చేపట్టారు. మరో రెండు రోజుల్లో విద్యుత్ సరఫరా ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

తమ సమస్యను గుర్తించి పరిష్కారం చూపిన శశికాంత్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వైకుంఠ ధామంలో నీటి సౌకర్యం కూడా కల్పించేలా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని శశికాంత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కథనానికి ఉపశీర్షిక: “ప్రజల సమస్యలపై స్పందనతో ముందుకొచ్చిన యువనేత”.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -