Friday, June 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. నిన్న రాత్రి రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో విరుచుకుపడింది. నల్ల సముద్రం, అజోవ్ సముద్రం సహా రష్యా పరిధిలోని మొత్తం 12 ప్రాంతాలపై ఏకంగా 660 డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే, ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నట్టు రష్యా మరో ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్‌ దాడుల్లో ఇదీ ఒకటని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు.ఇటీవల కాలంలో ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తోంది. రష్యా చమురు రంగాన్ని దెబ్బతీసేలా ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడులు చేస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీసి నిధులు అందకుండా చేయాలని ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది.

రష్యాపై 40 రోజుల ఇన్‌ఫ్లుయెన్స్ ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇత తాజా దాడిలో రష్యాలోని ఒక రసాయనిక కర్మాగారం దెబ్బతిందని స్థానిక గవర్నర్ తెలిపారు. ఈ దాడిలో ఒక మహిళ గాయపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -