Friday, June 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలులండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

లండన్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మరుసటి రోజే అతను శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25)గా గుర్తించారు. లీసెస్టర్‌లో ఎమ్మెస్ చదువుతున్న శ్రీనాథ్, ఈనెల 22 రాత్రి స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లిన తర్వాత, మరుసటి రోజు తన గదిలో శవమై కనిపించాడు. విద్యార్థి మరణంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -