Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా శ్రీ కనకదుర్గాదేవి 11వ వార్షికోత్సవాలు ప్రారంభం

ఘనంగా శ్రీ కనకదుర్గాదేవి 11వ వార్షికోత్సవాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
శ్రీ కనకదుర్గాదేవి శ్రీ  మల్లేశ్వర స్వామి 11వ వార్షికోత్సవ ఉత్సవ వేడుకలు, ఆలేరు పట్టణంలో ఆలయ కమిటీ సభ్యులు పట్టణ పుర ప్రముఖుల సమక్షంలో గురువారం ప్రారంభమయ్యాయి. వార్షికోత్సవ వేడుకలని, ఆలయ ప్రధాన అర్చకులు ఆలేటి రంగన్న పంతులు ఆధ్వర్యంలో గణపతి పూజతో ప్రారంభించారు. ఆలేరు మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ గణపతి పూజలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ పుర ప్రముఖులు, కుల సంఘాల నాయకులు, భక్తులు శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఉత్సవంలో పాల్గొన్నారు. గణపతి పూజ,పుణ్యావచనం, అమ్మవారికి అభిషేకంతో పూజ ప్రారంభమైంది. 26వ తేదీ శుక్రవారం నిత్య పూజ పారాయణం అమ్మవారి హోమం, సాయంత్రం 6 గంటలకు శ్రీ కనకదుర్గాదేవి,మల్లేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించబడును.

27వ తేదీ శనివారం నిత్యపూజ తీర్థప్రసాద వితరణ జరుగును. ఉదయం 8 గంటల నుండి మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ కొలుపుల హరినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొలుపుల హరినాథ్, కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -