నవతెలంగాణ-ఆలేరు టౌను
పారిశ్రామిక శిక్షణా సంస్థ ఏటీసీలో ప్రవేశాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని, పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల నుండి, ఇంటర్మీడియట్ ,డిగ్రీ విద్యాను పూర్తి చేసిన యువతి యువకులనుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏటీసీ యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల ఇన్చార్జ్ , ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్, ఎస్వివి సత్యనారాయణ ఆలేరు పట్టణంలో గురువారం నవతెలంగాణకు తెలియజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యువతీ యువకులు ప్రభుత్వ మరియు ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థలలో (ఐటి ఐ )/ ఏటీసీ 2026- 2027, మొదటి విడత ప్రవేశానికి దరఖాస్తులు (అడ్మిషన్స్ ) జూన్ 30 అడ్మిషన్లకు చివరి తేదీ అని చెప్పారు. ఐ.టి.ఐ. కోర్సులు సోలార్ టెక్నీషియన్, [ఎస్.ఎస్.సి] ఒక సంవత్సరం, ఐ.ఓ.టి స్మార్ట్ సిటీ [ఎస్.ఎస్.సి] ఒక సంవత్సరం, ఎలక్ట్రీషియన్ [ఎస్.ఎస్.సి] రెండు సంవత్సరాలు, ఫిట్టర్ [ఎస్.ఎస్.సి] రెండు సంవత్సరాలు, వెల్డర్ విద్యారహత [8వ తరగతి] ఒక సంవత్సరం, కోపా [ఎస్.ఎస్.సి] ఒక సంవత్సరం, వీటితోపాటు ఏటీసీ కోర్సులు సి ఎన్ సి మెషీనింగ్ టెక్నీషియన్, [ఎస్ఎస్సి ] రెండు సంవత్సరాలు, వర్చువల్ అనాలిసిస్ మరియు డిజైనర్ ఎఫ్ ఈ ఎం [ఎస్ఎస్సి ] రెండు సంవత్సరాలు, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ [ఎస్ఎస్సి ] రెండు సంవత్సరాలు,ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ [ఎస్ఎస్సి ] ఒక సంవత్సరం, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ [ఎస్ఎస్సి ] ఒక సంవత్సరం, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ మరియు ఆటోమేషన్ [ఎస్ఎస్సి ] ఒక సంవత్సరం కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు .
విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఎస్ఎస్సి ,క్యాస్ట్ , బోనాఫైడ్ సర్టిఫికెట్లు 1స్ట్ to 10 తరగతి మొదలగునవి ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అడ్మిషన్ల చివరి తేదీ ఈ నెల 30వ తేదీ అని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అడ్మిషన్లు ఆన్లైన్ పద్ధతిన జరుపబడునని వెబ్సైట్ అడ్రస్ https://ఐటి . తెలంగాణ .గవర్నమెంట్ .ఇన్ లాగిన్ కావాలని, మరిన్ని వివరాలకు 9110523925,9885894440 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.



