Saturday, June 27, 2026
E-PAPER
Homeఆటలుబీసీసీఐ గుర్తింపు సాధిస్తాం!

బీసీసీఐ గుర్తింపు సాధిస్తాం!

- Advertisement -

తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్ దీమా
ఈ ఏడాది క్రికెట్‌ షెడ్యూల్‌ విడుదల

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌కు (టీసీఏ)కు త్వరలోనే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు లభిస్తుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి దీమా వ్యక్తం చేశారు. బీసీసీఐ గుర్తింపు లభిస్తే.. టీసీఏ జట్లు రంజీ ట్రోఫీ సహా ఇతర దేశవాళీ టోర్నమెంట్లలో పోటీపడే అవకాశం దక్కనుందని ఆయన తెలిపారు. 2026-27 సీజన్‌ షెడ్యూల్‌ను టీసీఏ శుక్రవారం విడుదల చేసింది. జులై 14 నుంచి అండర్‌-16 ఇంటర్‌డిస్ర్టిక్స్‌ లీగ్‌తో ఈ ఏడాది క్రికెట్‌ సీజన్‌ ఆరంభం కానుండగా.. 24 జులై నుంచి అండర్‌-19 వన్డే లీగ్‌, జులై 19 నుంచి సీనియర్స్‌ వన్డే లీగ్‌, జులై 20 నుంచి మహిళల చాలెంజర్ కప్‌, ఆగస్టు 21 నుంచి తెలంగాణ ఉమెన్స్‌ లీగ్‌, ఆగస్టు 27 నుంచి తెలంగాణ స్టేట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభం అవుతాయని టీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి టోర్నమెంట్‌లో సత్తా చాటిన 40 మంది క్రికెటర్లతో రాష్ట్ర జట్ల ఎంపిక కోసం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని గురువారెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -