Saturday, June 27, 2026
E-PAPER
Homeఆటలుటాప్‌ లేపిన యువ షూటర్లు

టాప్‌ లేపిన యువ షూటర్లు

- Advertisement -

జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 24 మెడల్స్‌
సుహ్ల్‌ (జర్మనీ): ప్రపంచ షూటింగ్‌లో టీమ్‌ ఇండియా దూసుకెళ్తోంది. జర్మనీలోని సుహ్ల్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షూటర్లు ఏకంగా 24 పతకాలు గురి పెట్టారు. ఏడు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు సహా 24 మెడల్స్‌ ఖాతాలో వేసుకున్న భారత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌లో సెజల్‌ కాంబ్లె వ్యక్తిగత విభాగంలో పసిడితో పాటు జట్టు విభాగంలో వణిష్క చౌదరి, నవ్య బిష్ణోయ్‌లతో కలిసి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. మెన్స్‌ 25మీ ర్యాపిడ్ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో సమీర్‌ గోల్డ్‌ పతకం సాధించాడు. ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్‌లో అభినవ్‌ చౌదరి, సాహిల్‌ చౌదరితో కలిసి కాంస్య పతకం గెల్చుకున్నాడు. అభినవ్‌ దేశ్వాల్‌ (మెన్‌ 25మీ స్టాండర్డ్‌ పిస్టల్‌), 10మీ ఎయిర్ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో శాంభవి, అభినవ్‌ షా జంట సైతం పసిడి పతకం సాధించారు. 50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో రోహిత్‌ బంగారు పతకం సాధించాడు. ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన షూటర్లను నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) అభినందించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -