- Advertisement -
- ఆరోగ్య కేంద్రం సందర్శనలో సీపీఐ(ఎం) మండిపాటు
- – పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి
- – ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేయాలని సూచన
- నవతెలంగాణ – బెజ్జంకి
- మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో 20 మంది సిబ్బందికి 6 గురే వైద్య సేవలందిస్తున్నారని..ప్రజలకు మేరుగైన వైద్య సేవలివ్వేనా అంటూ జిల్లాధికారుల తీరుపై సీపీఐ(ఎం) మండల నాయకులు మండిపడ్డారు. సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ అదేశానుసారం శనివారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సీపీఐ(ఎం) నాయకులు సందర్శించి ఆస్పత్రిలో సిబ్బంది వివరాలు, పనితీరు, గదులు, వైద్య పరీక్షల వంటి వాటిని పరిశీలించారు.
- మండల కేంద్రంలోని ఆస్పత్రికి ప్రజల తాకిడి పెరిగిందని.. ప్రజలకు సరైన వైద్య సేవలందించడానికి సిబ్బంది లేకపోవడం జిల్లాధికారులు చూపుతున్న వివక్షకు నిదర్శనమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు,ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) పార్టీ అధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని జిల్లాధికారులను హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరు,సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు సంఘ ఎల్లయ్య,బొమ్మిడి సాయి,బోనగిరి లింగం పాల్గొన్నారు.
- Advertisement -



