- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
పాఠశాలకు సంబదించిన ప్రతి ఒక్క రికార్డు పక్కాగా నమోదు చేయాలని మండల తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుభీర్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పాఠశాల రికార్డులో ఎలాంటి సమాచారం నమోదు చేయకపోవడంతో అక్కడి సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం పాఠశాల తరగతి గదులను, వంట గది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆమె వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేష్ ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు మురళి ఉన్నారు.
- Advertisement -



