నవతెలంగాణ – మల్హర్ రావు
పటిష్ఠమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజలు సహకరించాలని పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, మల్లారం, ఎడ్లపల్లి, కొయ్యుర్, తాడిచెర్ల గ్రామాల సర్పంచ్లు బండారి నర్సింగం, గడ్డం క్రాంతి, మేకల రాజయ్య, కొండ రాజమ్మ, బండి స్వామిలు కోరారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాలతో శనివారం ఆయా గ్రామాల్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓలు అందిస్తున్న ఎన్యూమ రేషన్ ఫారాలు, రిజిస్టర్ లో నమోదులు, యాప్ ఎంట్రీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాట్లాడారు 2002 ఓటరు జాభితా ప్రకారం మ్యాపింగ్ చేయాల్సి ఉన్నదని తెలిపారు. బూత్ స్థాయి సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారని అందులో ఉన్న వివరాలు నమోదు చేయాలని ఓటర్లకు అవగహన కల్పించారు. బూత్ స్థాయి అధికారి వద్ద ఓటరు జాభితా ఉంటుందని ప్రతి ఒక్కరు తమ పేర్లు పరిశీలించాలని తెలిపారు. జాబితాలో పరిశీలన అలాగే అనర్హులైన వారి పేర్లను తొలగించేందుకు జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
ఓటరు జాబితా పరిశుద్ధత ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అర్హత ఉన్న వారు తమ పేరు నమోదు చేయించుకోవడమే కాకుండా, మరణించిన వారు, మారిన వారు వంటి అనర్హుల వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇందుకోసం ఎన్నికల శాఖ ప్రత్యేకంగా చేపట్టిన సర్వే కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ప్రజలు సమగ్ర సమాచారం అందించి సహకరించాలని కోరారు.అదేవిధంగా, యువత 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్,వొన్న తిరుపతి రావు, బిఎల్ఓలు,ప్రజలు పాల్గొన్నారు.



