Saturday, June 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన

- Advertisement -

ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్
నవతెలంగాణ-ఆర్మూర్ 

దూర ప్రాంతాలలో గుర్తింపు లేని సంస్థలలో ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో యువత మోసపోవద్దని,అటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ & ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. శనివారం ఆయన  పట్టణంలో స్మార్ట్ విజన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ ను యాజమాన్యం, సిబ్బంది కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. యువత తమకు అంది వచ్చిన ఉపాధి ఉద్యోగ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే రాబోయే రోజుల్లోనూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని హితవు పలికారు.  ఈ కార్యక్రమంలో  ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, వినోద్, దినేష్, ముఖేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -