ఇలాంటి గౌరవం అందుకున్న తొలి అధ్యక్షుడిని నేనే : ట్రంప్
సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడి పోస్టు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిం చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన ఫొటోను ఆయన తన పోస్ట్‌లో పంచుకున్నారు. తన పేరుతో రోడ్డుకు నామ కరణం చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలను తెలిపారు. ఈ విధంగా గౌరవాన్ని అందుకున్న తొలి అమెరికా అధ్యక్షు డిని తానేనని తన పోస్టులో పేర్కొన్నారు.
ఆ రోడ్డుకు ట్రంప్ అవెన్యూగా నామకరణం
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23న హైదరాబాద్ నగరంలో విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ పక్కన ఉన్న రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అమెరికా టెక్ కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్లు ఈ రోడ్డుకు సమపంలోనే ఉన్నాయి. తెలంగాణ, యూఎస్ మధ్య వాణిజ్య, వ్యాపార, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
అమెరికా ఫస్ట్ అంటే ఒంటరిగా ఎదగడం కాదు
భారత్-అమెరికాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలోని ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. హైటెక్ సిటీ నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల వరకు ఈ ప్రాంతం సాధిస్తున్న ప్రగతి మన ద్వైపాక్షిక సంబంధాల వేగాన్ని నిర్వచిస్తోందని ఆయన తెలిపారు. ‘అమెరికా ఫస్ట్’ అంటే అమెరికా ఒంటరిగా ఎదగడం కాదని తాము నిరూపిస్తున్నామని సెర్గియో గోర్ వెల్లడించారు. యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టి గౌరవించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మాట్లాడుతూ తెలంగాణ ఏపీ, ఒడిశా రాష్ట్రా ల్లోని ఏరోస్పేస్, డిఫెన్స్, ఏఐ, బయోఫార్మా రంగాలు ప్రపంచ భవిష్యత్తును మారుస్తున్నా యని అన్నారు. ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఇక్కడి ప్రతిభ స్వేచ్ఛగా అమెరికాకు చేరేలా కాన్సులేట్ కృషి చేస్తుంది అని లారా విలియమ్స్ హామీ ఇచ్చారు.
థాంక్యూ తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



