Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు నల్లగొండకు సీఎం రాక

నేడు నల్లగొండకు సీఎం రాక

- Advertisement -

హ్యాంరోడ్లకు శంకుస్థాపన
సభా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న కనగల్, నల్లగొండలో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్.జి కళాశాల ఆవరణలో బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. రూ.13006 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యాంరోడ్ల శంకుస్థాపన పైలాన్‌‌ను ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు కనగల్ లో సీఎం ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత నల్లగొండలోని నాగార్జున కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన శిలా ఫలకం చేయనున్నారు.

సీఎం కార్యక్రమాలపై కలెక్టర్‌ ‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ఎన్ జి కళాశాల ఆవరణలో బహిరంగ సభకు వచ్చే జనం కోసం తాగునీరు, టాయిలెట్లు, టెంట్లు, వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్‌‌ను క్రమబద్దీకరిస్తున్నట్టు తెలిపారు. తిప్పర్తి తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పానగల్ రోడ్ మీదుగా, దేవరకొండ వైపు నుంచి వచ్చే వాహనాలను రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక వైపు నుంచి, మర్రిగూడ బైపాస్ నుంచి వచ్చే వాహనాలను ఎన్జీ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుని ప్రజలను దించి వెళ్లేలాగా మ్యాప్ తయారు చేశామన్నారు. వారి వెంట అదనపు ఎస్పీ రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఎఫ్ఓ రాజశేఖర్, డిఆర్ఓ దశరథ్, ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చా‌ర్జి కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -