Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తేయాలి

క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తేయాలి

- Advertisement -

రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
నవతెలంగాణ – సుల్తానాబాద్
సోషలిస్టు క్యూబా దేశంపై సామ్రాజ్యవాద అమెరికా ఆంక్షలను ఎత్తేయాలని, క్యూబా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శనివారం సంతకాల సేకరణ నిర్వహంచారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ.. సోషలిస్టు క్యూబా దేశంపై అమెరిక వివిధ రకాలుగా ఆంక్షలు విధించి ఆర్థిక దిగ్బంధనం చేయడం మూలంగా ఆ దేశ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. క్యూబాలో అనేక కంపెనీలు మూతపడి లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని, చివరికి ఆ దేశంలో కరెంటు కూడా వాడుకునే పరిస్థితి లేదని అన్నారు. దుర్భర పరిస్థితిని సృష్టించి సోషలిస్టు క్యూబా ప్రభుత్వంపై అక్కడి ప్రజలతో తిరుగుబాటు చేయించి, తద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకుని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అమెరికా కుట్ర చేస్తోందని అన్నారు. అక్కడి సహజ వనరులను కొల్లగొట్టాలన్న దుర్బుద్ధితో యుద్దోన్మాది ట్రంప్‌ ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ఆంక్షలు వెంటనే ఎత్తేసి క్యూబా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని డిమాండ్ చేశారు. అత్యంత ధైర్యసహసాలతో పోరాడుతున్న క్యూబా ప్రజలకు సీఐటీయూ సంఘీభావం తెలియజేస్తుందని చెప్పారు. కార్మిక వర్గం చైతన్యంతో ఇలాంటి అంతర్జాతీయ సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొని ప్రపంచ శాంతి కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షులు తాండ్ర అంజయ్య, ప్రధాన కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, రైస్ మిల్ గుమస్తాల సంఘం అధ్యక్షులు మాతంగి రాజమల్లు, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షులు బండారి స్వామి, తిరుపతి, కిరణ్, రమేష్, విలాస్, పర్వతాలు, రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -