రిజర్వేషన్ల సాధన రాష్ట్ర కూటమి డిమాండ్
పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు
సమస్యల పరిష్కారానికి గొంతు విప్పాలి: రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా
మహిళలకు వ్యతిరేకి బీజేపీ: సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
బీజేపీ కుట్ర: సీపీఐ నేత పశ్య పద్మ
రిజర్వేషన్ సాధనకు ఢిల్లీలో సభ: టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహిళా రిజర్వేషన్ల చట్టం 2023ను జనాభా లెక్కలు, నియోజకవర్గ పునర్విభజన నుంచి వేరు చేసి అమలు చేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం హైదరాబాద్‌లోని మగ్థూంభవన్‌లో మహిళా రిజర్వేషన్ల సాధన రాష్ట్ర కూటమి ఆధ్వర్యంలో రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా అధ్యక్షతన జరిగిన సమా వేశంలో ఆయా పార్టీలు, మహిళా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా నేతల ప్రసంగాలు వారి మాటల్లోనే..
సమస్యల పరిష్కారం కోసం గళం విప్పాలి:రామన్ మెగాసేస్ అవార్డు గ్రహిత శాంతాసిన్హా
సమాజంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేదరికం, అవిద్య, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం గళం విప్పాలి. ఇందుకు ఐక్యంగా ముందుకు సాగాలి. పోరాడి సాధించుకోవటానికి సిద్ధం కావాలి. సమస్యలపై ప్రణాళికాబద్దంగా ముందుకు వెళితే అసాధ్యమేమీ కాదు.
బీజేపీ కుట్ర: సీపీఐ నేత పశ్య పద్మ
1996లో మహిళా బిల్లు పై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షత వహించిన సీపీఐ జాతీయ నాయకురాలు గీతా ముఖర్జీ దేశవ్యాప్తంగా పర్యటించి మూడు నెలలకు సమయంలో నివేదిక ఇచ్చారు. పార్లమెంటరీ సంయుక్త కమిటీలు ఏకాభిప్రాయాన్ని సాధించి పార్లమెంటుకు నివేదించింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు జన జనగణన, నియోజకవర్గాల పునర్విభజన కు లింకు పెట్టి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీ చూస్తున్నది. ప్రజలు గమనిస్తున్నారు. మహిళా లోకం బీజేపీఐ అసంతృప్తితో రగులుతున్నది.
రిజర్వేషన్ సాధనకు ఢిల్లీలో సభ:
టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కావాల్సిందే. ఇటీవల నన్ను కలుస్తున్న కొంతమంది యంగ్ ఉమెన్ లీడర్లు మనకు రిజర్వేషన్లు ఎందుకు అని అడుగుతున్నారు ? కానీ ఒక స్థాయి వరకు మహిళలు ఎదిగిన తర్వాత వారికి అడ్డుకట్ట వేస్తారు. అందుకే మహిళలకు కచ్చితంగా రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉంది. బిల్లును సత్వరమే అమలు చేయాలంటే మన శక్తిని ప్రదర్శించాలి. మహిళా రిజర్వేషన్ల సాధన కోసం నెక్లెస్‌రోడ్‌లో, ఢిల్లీ రామ్ లీలా మైదానంలో భారీ సభ నిర్వహిద్దాం. మహిళా బిల్లు ఆమోదం కోసం 2022-23 లో మేము జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశాం. అంతటితో ఆగకుండా పార్లమెంట్ లో ఈ అంశంపైనే మాట్లాడాలంటూ 18 పార్టీలతో మాట్లాడిం చాం. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగి మహిళా బిల్లుకు ఆమోదం లభించింది. కానీ ఆ బిల్లును పోస్ట్ డేటేడ్ చెక్ మాదిరిగా తయారు చేశారు. ఇప్పటికీ దాన్ని అమలు చేసేందుకు కొర్రీలు పెడుతున్నారు. మేము మహిళా బిల్లులో ఓబీసీ మహిళా కోటా పెట్టాలంటే అసలు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లే లేవని అంటున్నారు. అంటే 33 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చిన పార్టీ నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే మహి ళలకు చట్టపరంగానే 33 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. మా పార్టీ పరంగా 33 శాతానికి తగ్గకుండా మహిళలకు సీట్లు కేటాయిస్తాం. సరైన మహిళా నాయకులు ఉంటే 50 శాతం టికెట్లు ఇవ్వటానికి కూడా సిద్ధం.
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు
బీజేపీ కుట్రలు సీపీఐ ఎంఎల్ సంధ్య, కాంగ్రెస్ శారద, టీజేఎస్ లక్ష్మి
మహిళా రిజర్వేషన్ల సాధనకు 30 ఏండ్లకు పైగా మహిళలు పోరాడుతుంటే మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేసి కూడా అమలు చేయటానికి అనేక రకాల అడ్డంకులు కల్పించడం వెనుక పురుషాధిక్య ప్రభావంతో పాటు బీజేపీ కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను అమలు చేసే వరకు పోరాడుదాం.ఈ సమావేశంలో స్వతంత్ర మహిళా సంఘాల నెట్‌వర్క్‌లకు చెందిన ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎన్ఏపీఎం నుంచి సునీత , దీప్తి మకాం ఆశాలత , రుక్మిణి, డీబీఎఫ్ నుంచి పులికల్పన , తెలంగాణ గృహ కార్మికుల సంఘం నుంచి సిస్టర్ లిజీ, ప్రొఫెసర్ రమా మేల్కొటే తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు పుస్తెల సృజన, కృష్ణకుమారి దేవ భక్తుని, నళిని, జ్యోతి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు ప్రేమ పావని, ఐద్వా నేత ఆశాలత, పీవోడబ్ల్యూ అనసూయ, ఝాన్సీ వై డబ్ల్యూ సి .ఎ-ఆర్తి, సీఎంఎస్- జ్యోతి పాల్గొన్నారు .
మహిళల వ్యతిరేకి బీజేపీ
సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు
మల్లు లక్ష్మి
బీజేపీ పాలకుల నైజాన్ని అర్థం చేసుకోవడానికి మహిళలు చైతన్యవంతం కావాలి. బీజేపీ మహిళలకు వ్యతిరేకం. విధాన నిర్ణయాల్లో మహిళలకు భాగస్వామ్యం కావాలని సీపీఐ(ఎం) పోరాడుతూనే ఉంది. 1996లో దేవగౌడ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని పెడితే లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరద్‌పవార్ లాంటివాళ్ళు ఆ ప్రతులను చింపేశారు. అనేక బిల్లులు ఏకాభిప్రాయం లేకుండానే పాస్ చేయిం చుకున్న బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు వచ్చేసరికి ఏకాభిప్రాయం పేరుతో పక్కనపెట్టింది. ఈ బిల్లు 1998,1999, 2003, 2009లో విఫలమైంది. 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ఆమోదం పొందకపోవడంతో ఈ బిల్లు వీగిపో యింది. 2023లో పార్లమెంటు సమా వేశాలలో నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది చట్టా రూపం దాల్చింది . ఆ చట్టాన్ని 2024లో ఎన్నికల్లో అమలు చేయలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ జనగణన తో ముడి పెడుతున్నారు. డీలిమిటేషన్ జనగణనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. అమలు చేయకపోతే వివిధ రూపాలలో పోరాటం చేస్తాం.అసెంబ్లీ సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని తీర్మానం చేయించి పార్లమెంటుకు పంపించాలి. సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇద్దాం. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు గవర్నర్ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం.
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



