Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రుద్రారంలో సీసీరోడ్డు పనులు ప్రారంభం

రుద్రారంలో సీసీరోడ్డు పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామంలో రూ.15 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధిహామీ నిధులతో మంజూరైన సిసి రోడ్డు అభివృద్ధి నిర్మాణ పనులకు భూమిపూజ చేసి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాలతో ఆదివారం గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ ప్రారంభించారు. ఐత మల్లారెడ్డి ఇంటి నుంచి కొమ్మర రమణాచారి ఇంటి వరకు రూ.10 లక్షలు,ఓడనాల సమ్మయ్య ఇంటి నుంచి తాడిచెర్ల రవి ఇంటి వరకు రూ.5 లక్షలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -