నవతెలంగాణ – సత్తుపల్లి : సత్తుపల్లి ఏరియాలోని పీవీఎన్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన సీఈఆర్ క్లబ్, కమ్యూనిటీ హాల్‌ను సింగరేణి డైరెక్టర్ (పీ అండ్ పీ) కొప్పుల వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటిచారి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… సింగరేణి కార్మికుల, ఉద్యోగులు, వారి కుటుంబ సంక్షేమానికి యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కార్మికులు మానసిక ఉల్లాసానికి, వ్యాయామానికి సీఈర్ క్లబ్ తోడ్పడుతుందన్నారు. కాలనీవాసులు తమ కుటుంబ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ నూతన కమ్యూనిటీ హాల్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సభాధ్యక్షులు జీఎం వెంకటాచారి మాట్లాడుతూ… పీవీఎన్ఆర్ కాలనీవాసులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏరియా ప్రాజెక్ట్ ఆఫీసర్లు, వివిధ విభాగాల అధిపతులు, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



