- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తాను ఈ ఏడాది ఖచ్చితంగా స్వదేశమైన బంగ్లాదేశ్లో అడుగుపెడతానని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పష్టం చేశారు. 2024లో బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమం కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ప్రాణాలు రక్షించుకోవడానికి ఆమె భారతదేశంలో శరణు పొందిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. మైనార్టీలపై జరిగే ప్రతి దాడిని, ఆ దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారంపై జరుగుతున్న దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -



