Monday, August 31, 2026
E-PAPER
Homeదర్వాజఅదీ కారణం

అదీ కారణం

- Advertisement -


అశ్రుబిందువును విశ్లేషించాను
లోకంలోని శోకమూర్తులందరూ గోచరించారు
చెమట చుక్కను పరిశీలించాను
భువన భవనాన్ని తమచేతులమీద మోస్తున్న
త్యాగమూర్తులు శ్రమజీవులు కనిపించారు
రక్త పరీక్ష చేసాను
ప్రపంచ మానవాళి సుఖశాంతుల కోసం
ప్రతీ కణంలో పరితపిస్తూ
కొట్టుకుంటున్న దయా హృదయాన్ని చూసాను
ఆర్ద్రమైన కన్నీటి చుక్కలను మింగి
పరిమళ సంభరితమైన
స్వేద బిందువులను వేధించుకు తిని
చిక్కటి నెత్తుటి నెత్తిమీదికెక్కి
పెత్తనం చేస్తున్న
అత్తరును కూడా అట్టే గమనించాను
నలిమెల భాస్కర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -