Monday, June 29, 2026
E-PAPER
Homeమానవిఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా?

ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా?

- Advertisement -

చాలా మంది మెడ చుట్టూ నల్ల మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య దురదకు కారణమవ్వడంతో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే, మెడపై మచ్చలుగా దద్దుర్లు రావడం అనేది చాలా సాధారణమైన సమస్య అని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. చర్మంపై అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు లేదా కొన్ని అంతర్గత సమ్యల వల్ల ఇది రావచ్చు. సాధారణంగా మెడ భాగంలోని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.
అంతేకాకు చెమట, రాపిడి, సూర్యరశ్మి, నగలు, కాస్మెటిక్ ఉత్పత్తులు వాడటంవల్ల కూడా మెడ చుట్టూ అలెర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. మెడ చుట్టూ నల్ల మచ్చలు, దద్దర్లు ఎందుకు వస్తాయి, ఏ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.


ముఖ్యమైన కారణాలు
​కాంటాక్ట్ డెర్మటైటిస్ : పర్ఫ్యూమ్‌లు, హెయిర్ ప్రొడక్ట్స్, డిటర్జెంట్లు, మెటల్ నగలు లేదా కొన్ని రకాల బట్టలు చర్మానికి తగిలినప్పుడు వచ్చే అలర్జీ ఇది. దీనివల్ల మెడ ఎర్రబడటం, దురద, పొడిబారడం లేదా మచ్చలు రావడం జరుగుతుంది.
హీట్ రాష్: వేసవిలో ముఖ్యంగా ఉక్కపోత, చెమట ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది.
ఇతర కారణాలు: ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, ఎగ్జిమా , ఎండ తీవ్రతకు చర్మం తట్టుకోలేకపోవడం, మానసిక ఒత్తిడి వల్ల కూడా మెడపై మచ్చలు రావచ్చు.
అకాంతోసిస్ నైగ్రికన్స్: మెడ చుట్టూ నల్లగా, వెల్వెట్ లాంటి మచ్చలు ఏర్పడితే దానిని ‘అకాంతోసిస్ నైగ్రికన్స్’ అంటారు. ఇది ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ (డయాబెటిస్ వచ్చే అవకాశం) లేదా హార్మోన్ల అసమతుల్యతను సూచిస్తుంది.
ఇతర లక్షణాలు
కారణాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. సాధారణంగా కనిపించేవి:
చర్మం ఎర్రబడటం లేదా నల్లబడటం
దురద, మంటగా అనిపించడం
చర్మం పొడిబారడం లేదా పొట్టులా రాలడం
చిన్న చిన్న కురుపులు లేదా బొబ్బలు రావడం
చికిత్స, జాగ్రత్తలు
​కారణాన్ని గుర్తించడం: దేనివల్ల అలర్జీ వస్తుందో తెలుసుకుని ఆ వస్తువులను/ప్రొడక్ట్స్ వాడటం ఆపేయాలి.
చర్మ సంరక్షణ: కెమికల్స్ లేని మైల్డ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలి. మెడ భాగాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. గాలి తగిలే కాటన్ బట్టలు వేసుకోవాలి.
మందులు: డాక్టర్ సలహా మేరకు యాంటీఫంగల్ క్రీములు, యాంటీహిస్టామైన్లు (దురద తగ్గించేవి) లేదా మైల్డ్ స్టెరాయిడ్ క్రీములు వాడాల్సి రావచ్చు.
పాటించాల్సిన చిట్కాలు
నగల ఎంపికలో జాగ్రత్త: ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల చాలా మందికి మెడ చుట్టూ అలర్జీ వస్తుంది. అలాంటి వారు ప్యూర్ గోల్డ్, సిల్వర్ లేదా త్రెడ్ జ్యువెలరీ ప్రిఫర్ చేయడం మంచిది.
పర్ఫ్యూమ్స్ నేరుగా కొట్టొద్దు: పర్ఫ్యూమ్స్ లేదా డియోడరెంట్లను నేరుగా మెడ చర్మంపై స్ప్రే చేయకుండా, బట్టలపై కొట్టుకోవడం అలవాటు చేసుకోండి.
సన్‌స్క్రీన్ వాడకం: ఎండ వల్ల వచ్చే రాషెస్ నివారించడానికి ముఖంతో పాటు మెడకు కూడా కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి.
బరువు నియంత్రణ: మెడ వెనుక భాగం నల్లగా మారే సమస్య ఉన్నవారు బరువు తగ్గడం, కార్బోహైడ్రేట్లు తగ్గించి హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా ఆ నలుపును తగ్గించుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -