Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం

అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ-నవతెలంగాణ: అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితుల తరఫున తమ సంఘానికి చెందిన ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని బార్ అసోసియేషన్ సోమవారం సంచలన తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే న్యాయవాదులపై రూ.5 లక్షల జరిమానా విధిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాళికా శరణ్ మిశ్రా స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ ఇన్‌ఛార్జి గోపాల్‌రావుపై కేసు నమోదు చేయాలని కూడా బార్ అసోసియేషన్ తీర్మానించింది. వీరంతా మరో మూడు రోజుల్లో అయోధ్యను వీడాలని, లేనిపక్షంలో నగరమంతా బంద్ చేపట్టి, ఆలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించింది. కాగా.. 2005లో రామ జన్మభూమి తాత్కాలిక ఆలయంపై జరిగిన ఉగ్రదాడి కేసులోనూ నిందితుల తరఫున వాదించబోమని నాడు ఇదే బార్ అసోసియేషన్ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -