Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంప్రజాశక్తి సిజిఎం అచ్యుతరావుకు మాతృవియోగం

ప్రజాశక్తి సిజిఎం అచ్యుతరావుకు మాతృవియోగం

- Advertisement -


తాడేపల్లి(గుంటూరు) :
ప్రజాశక్తి సిజిఎం వై.అచ్యుతరావుకు మాతృవియోగం కలిగింది. సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు యార్లగడ్డ జోయ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని చిన్న కుమారుడు వై.అచ్యుతరావు ఇంటి వద్ద ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలిగా, పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా కమిటీ సభ్యులుగా, నందిగామ డివిజన్ కమిటీ కార్యదర్శిగా, రైతు, మహిళా సంఘాలకు బాధ్యతలు నిర్వహించారు. సీపీఐ(ఎం) అభివృద్ధికి అహర్నిశలు పని చేశారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతికి సీపీఐ(ఎం) ఎన్టీఆర్ జిల్లా కమిటీ సంతాపాన్ని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -