Monday, June 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లోని మాల్స్, లాడ్జిలకు నోటీసులు

హైదరాబాద్‌లోని మాల్స్, లాడ్జిలకు నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: షాపింగ్ మాల్స్, లాడ్జిల్లో.. హిడెన్ కెమెరాలు, స్పై కెమెరాలు ఏర్పాటు చేసి.. అక్కడికి వచ్చే కస్టమర్ల ప్రైవేటు వీడియోలను తీసి.. వాటిని సోషల్ మీడియాలో, పోర్న్ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేసే కొంతమంది దుర్మార్గుల వ్యవహారం ఇప్పటివరకు చాలాసార్లు బయటపడ్డాయి. ఇలాంటి ఘటనలతో మహిళలు.. మాల్స్‌లోని ట్రయల్ రూమ్, లాడ్జిల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో మహిళల భద్రత, వారికి భరోసాను కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో ఉన్న షాపింగ్ మాల్స్, లాడ్జిల్లో స్పై కెమెరాలకు అడ్డుకట్ట వేసేందుకు వాటి యాజమాన్యాలకు తాజాగా నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్‌ నగరంలో స్పై కెమెరాల కట్టడికి పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్స్‌ రూమ్స్‌.. రెస్ట్‌ రూమ్స్‌లలో.. మహిళల ప్రైవసీకి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కస్టమర్‌ సేఫ్టీ ఇంఛార్జ్‌ను మాల్స్, లాడ్జిల్లో నియమించాలని పోలీసులు.. సంబంధిత యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని 100కు పైగా మాల్స్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -