Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంఖమేనీ అంత్యక్రియలు..హాజరుకానున్న బీహార్ గవర్నర్

ఖమేనీ అంత్యక్రియలు..హాజరుకానున్న బీహార్ గవర్నర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే నెల జులై 4, 5 తేదిల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ దేశ ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల పాటు జరిగే అంత్యక్రియలకు వివిధ దేశాలకు చెందిన నాయకులను ఆహ్వానిస్తోంది. ఈక్రమంలోనే ఇరాన్ ఆహ్వానం మేరకు ఖమేని అంత్యక్రియలకు భారతదేశం తరపున బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అత హస్నైన్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీట హాజరకానున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) అధిపతిగా బ్రిగేడియర్ జనరల్ హసన్ హసన్‌జాదే ఈ కార్యక్రమాలను పర్యవేక్షించినున్నారు. జూలై 4, 5 తేదీలలో బహిరంగ వీడ్కోలు కార్యక్రమాలు, అంత్యక్రియల ప్రత్యేక ప్రార్థనలు ,ఊరేగింపు నిర్వహించనున్నారు.

B

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -